Thu Dec 19 2024 18:26:19 GMT+0000 (Coordinated Universal Time)
హైడ్రాకు నాగార్జున స్థలంపై ఫిర్యాదు
హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది.
హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి జనం కోసం సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో నాగార్జున ఈ చెరువును ఆక్రమించారని, దీనిని కూల్చి వేయాలని ఫిర్యాదులో ఆ సంస్థ హైడ్రాను కోరింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్...
హైడ్రా గత కొంతకాలంగా హైదరాబాద్ ప్రాంతంలో చెరువులను ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశారు. విల్లాలను కూడా కూల్చి వేశారు. దీంతో ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.
Next Story